News January 31, 2025
హైవే ఏర్పాటుకు రైతులు సహకరించాలి: WGL కలెక్టర్

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై రైతుల ఎలాంటి అపోహలు చెందవద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి తెలిపారు. ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాట్ల కోసం భూ సేకరణకు పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ, సంగెం మండలం చింతలపల్లి మండలాలకు చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 12, 2025
నిర్లక్ష్యం వహిస్తే సహించబోను: ప్రకాశం కలెక్టర్

బాలలకు ఆధార్ కార్డుల జారీ కోసం ప్రత్యేక శిబిరాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని కలెక్టర్ అన్సారియా స్పష్టం చేశారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందితో బుధవారం ఒంగోలులోని కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శిబిరాల తీరు, పురోగతిపై సమక్షించారు. పనితీరు పేలవంగా ఉన్న సిబ్బందికి షోకజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులకు తెలిపారు.
News February 12, 2025
కొద్దిరోజుల్లో బ్రాందీ, విస్కీ రేట్లూ పెరుగుతాయి: మాజీ మంత్రి

TG: తెలంగాణ, ఏపీని మద్యం మాఫియా నడిపిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. రెండు రాష్ట్రాలు ఒప్పందంతో నడుస్తూ ఒకేసారి మద్యం ధరలు పెంచాయని అన్నారు. కొద్దిరోజుల్లో బ్రాందీ, విస్కీ రేట్లూ పెరుగుతాయని తెలిపారు. ధరలు ఎవరు పెంచుతున్నారో తమకు తెలుసని, త్వరలోనే అన్ని వివరాలు బయట పెడతామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
News February 12, 2025
KMR: ఎల్లారెడ్డి ఘటనపై స్పందిచిన ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ అసమర్థతతో ఇప్పటికే గురుకులాల వ్యవస్థను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం Xలో విమర్శించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు లేక భోజనం కోసం విద్యార్థులు ఎండలో కి.మీ. నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పాఠశాల ఆవరణలోనే భోజనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.