News January 31, 2025
హైవే ఏర్పాటుకు రైతులు సహకరించాలి: WGL కలెక్టర్

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై రైతుల ఎలాంటి అపోహలు చెందవద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి తెలిపారు. ఎక్స్ప్రెస్ హైవే ఏర్పాట్ల కోసం భూ సేకరణకు పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ, సంగెం మండలం చింతలపల్లి మండలాలకు చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2025
NRPT: ఆర్టీఐకి స్పందన కరువు.. విచారణకు నోటీసులు

దామరగిద్ద మండలంలో కంది, వేరుశనగ విత్తనాల పంపిణీ, రైతు బీమా లబ్ధిదారుల వివరాలు కోరుతూ సెప్టెంబరు 23న ఆర్టీఐ దరఖాస్తు చేసినా స్పందన రాలేదు. దీంతో అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్కు అప్పీల్ చేసినట్లు ఆర్టీఐ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడు కొనింటి నర్సింలు తెలిపారు. దీనిపై ఏడీఏ స్పందించి, విచారణకు సోమవారం హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
News November 21, 2025
ధర్మారం: పిల్లల కోసం వినూత్న కార్యక్రమాలు.. సత్కారం

ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ను స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా పిలిచి సత్కరించారు. SEPT 2024 నుంచి ఆయన నూతన ఆలోచనలతో నాణ్యమైన విద్య, SPC, మాసపత్రిక, రేడియో FM 674.26, ప్లాస్టిక్ రహిత పాఠశాల, మీల్స్ విత్ స్టూడెంట్స్, ప్లే ఫర్ ఆల్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. విద్యార్థుల అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించిన కమిషనర్ రాజ్ కుమార్ను అభినందించారు.
News November 21, 2025
పెరుగుతున్న టమాటా ధరలు

దేశవ్యాప్తంగా టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. OCT 19 నుంచి NOV 19 మధ్య KG ధర సగటున ₹36 నుంచి ₹46కు పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు పెళ్లిళ్ల సీజన్ కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పటికే కొన్నిచోట్ల KG రేటు ₹80కి చేరింది. కాగా APలోని అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్లో నిన్న గరిష్ఠంగా KG రేటు రూ.50 పలికింది.


