News March 25, 2024
హొలీను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: కలెక్టర్

రాధ, కృష్ణుల ప్రేమకు ప్రతి రూపంగా జరుపుకునే అతి ముఖ్యమైన హోలీ పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కలెక్టర్ డిల్లీరావు ఆకాంక్షించారు. సోమవారం హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ విశిష్ఠతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని సంప్రదాయ బద్ధంగా రసాయన రహిత రంగులతో పండుగ జరుపుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరి జీవితం ఇంద్రధనస్సులో సప్తవర్ణ శోభితం కావాలని కోరారు.
Similar News
News November 28, 2025
తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

రానున్న దిత్వా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డీ.కే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశమైన ఆయన తుఫాన్ ముందస్తు జాగ్రత్త చర్యలపై శుక్రవారం సమీక్షించారు. ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని, రైతులను అప్రమత్తం చేసి కోసిన ధాన్యం తడిచి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.
News November 28, 2025
ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

జిల్లాలో ఇసుక కొరత లేకుండా సామాన్యులకు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన కలెక్టర్, సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహించి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.