News October 24, 2024

హోంశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే జయసూర్య

image

హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ పగిడ్యాల మండల కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి గురువారం కలిశారు. నియోజకవర్గంలో జరగాల్సిన పనులపై, వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులపై చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 9, 2025

కర్నూలు జిల్లా విశ్వబ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలిగా పద్మావతి

image

విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన పద్మావతి నియమితులయ్యారు. ఆదివారం పత్తికొండ పట్టణంలో విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి సమావేశం జరిగింది. ఇందులో విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పద్మావతిని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. తనను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News November 9, 2025

ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త: ఎస్పీ

image

ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరు పెట్టి వచ్చే యాడ్స్, వాట్సాప్/ ఇన్‌స్టాగ్రామ్/ టెలిగ్రామ్ లింక్స్‌‌ను నమ్మవద్దు అన్నారు. తక్కువలో ఎక్కువ లాభాలు వచ్చే వాగ్దానాలు కచ్చితంగా మోసం చేసేందుకే అన్నారు. లింక్స్ క్లిక్ చేయొద్దని, అపరిచిత APK/ఫైళ్ళు ఇన్‌స్టాల్ చేయవద్దని, OTP, UPI PIN వంటివి చెప్పొద్దన్నారు.

News November 8, 2025

కర్నూలు-వైజాగ్‌కు ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభం

image

కర్నూలు నుంచి వైజాగ్‌కు 3 నూతన ఏసీ బస్సు సర్వీసులను కర్నూలులో మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసుల వల్ల రెండు ప్రాంతాల్లో టూరిజం డెవలప్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని మంత్రి అన్నారు. ఇక బస్సు ప్రమాదాలు జరగడం ఎంతో బాధాకరమని, ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ బస్సులో ఉంటే ఇటీవల కర్నూలులో బస్సు ప్రమాదం జరిగేది కాదని అన్నారు. దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు.