News April 3, 2024

హోం ఓటింగ్‌కు సంబంధించి సమాచారం సేకరించండి: నంద్యాల కలెక్టర్

image

అత్యవసర సేవలందించే వ్యక్తుల పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన ప్రక్రియను బుధవారం సాయంత్రంలోగా పూర్తిచేయాలని రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. జిల్లాలో మొత్తం సుమారు 36 వేల పోస్టల్ బ్యాలెట్ల అవసరం ఉంటుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా చదివి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరికి సమర్పించాలి, సంబంధిత ఫార్మేట్‌లపై అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News April 18, 2025

కర్నూలు: స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రపై జేసీ ఆదేశాలు 

image

ఏప్రిల్ 19న నిర్వహించనున్న స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కర్నూలు జేసీ డా.బి.నవ్య అధికారులకు ఆదేశించారు. గురువారం టెలి కాన్ఫరెన్స్‌లో భాగంగా ఎలెక్ట్రానిక్ వెస్ట్ కలెక్షన్, వాట్సాప్ గవర్ననెన్స్‌పై అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని సూచించారు. రెడ్యూస్ రీసైకిల్ & రీయూస్ సెంటర్లను ఏర్పాటుచేసి, మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పారు.

News April 17, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ ఆదోనిలో 19న జాబ్‌మేళా➤ మంత్రాలయం: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య➤ సీజ్ ద గోడౌన్: ఎంపీ శబరి➤ ఆదోనిలో అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్➤ హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి: జిల్లా ఎస్పీ➤ కోడుమూరు: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి➤ కర్నూలు: సీనియర్ సిటిజన్ ఐడీకి ఆన్‌లైన్ దరఖాస్తులు➤ ప్రతి ఒక్కరికి క్రీడా స్ఫూర్తి అవసరం:డీఐజీ➤ కర్నూలుకు చేరుకున్న కేంద్ర మంత్రి ప్రహల్లాద్ జోషి

News April 17, 2025

కర్నూలు: సీనియర్ సిటిజన్ ఐడీకి ఆన్‌లైన్‌‌ దరఖాస్తులు 

image

జిల్లా వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వయో వృద్ధుల సంక్షేమశాఖ అధికారి రయిస్ ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 ఏళ్లు పైబడిన పురుషులు, 58 ఏళ్లు పైబడిన మహిళలు సీనియర్ సిటిజన్లు అర్హులన్నారు. ఈ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్, పాసుపోర్టు సైజు ఫొటోతో వార్డు, గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

error: Content is protected !!