News December 10, 2024

హోం మంత్రి అనితకు హైకోర్టులో ఊరట

image

హోంమంత్రి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. చెక్‌బౌన్స్ కేసులో విశాఖ కోర్టులో ఉన్న కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనిత, ఫిర్యాదుదారుడు కోర్టుకు హాజరై రాజీ కుదుర్చుకున్నామని చెప్పడంతో కేసును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. 2015లో శ్రీనివాసరావు వద్ద రూ.70లక్షలు అప్పుతీసుకున్న ఆమె 2018లో చెక్కు ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అవ్వగా అప్పట్లో విశాఖ కోర్టులో సూట్ దాఖలు చేశారు.

Similar News

News January 22, 2025

విశాఖ: 10కి చేరిన అరెస్ట్‌ల సంఖ్య

image

విశాఖ సీపీ ఆదేశాలు మేరకు టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రైడ్ చేసి ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి ద్వారా మరికొంతమంది బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 10మందిని అరెస్టు చేశారు. ఈ బెట్టింగ్ ద్వారా రూ.178 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో ఎవరినీ విడిచి పెట్టమని సీపీ తేల్చి చెప్పారు.

News January 22, 2025

ఈనెల 29 నుంచి నవోదయం: మంత్రి కొల్లు

image

పెందుర్తిలోని జెర్రిపోతులపాలెంలో మద్యం డిపోను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం పరిశీలించారు. ఈనెల 29 నుంచి రాష్ట్రంలో నవోదయం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నాటు సారా లేకుండా చేసి చూపిస్తామన్నారు. ఎవరైనా, ఎక్కడైనా కల్తీ సారా అమ్మినట్లు తెలిసినా, గంజాయి సాగు, రవాణాకు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ఉన్నారు.

News January 21, 2025

విశాఖలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

విశాఖలోని పీఎం పాలెం పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. HPCL లేఔట్‌లోని ఓ ఇంటిలో బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నల్ల సాయితేజను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు.