News June 27, 2024
హోం మంత్రి అనిత ఫొటో ఉన్న ఫ్లెక్సీ చించివేత

ఎస్.రాయవరం మండలం పెద్ద ఉప్పలం గ్రామంలో హోం మంత్రి అనిత ఫొటో ఉన్న ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. విత్తనాల పంపిణీ కార్యక్రమానికి హోంమంత్రి అనిత హాజరవ్వగా టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు తాతబ్బాయి గ్రామ సచివాలయం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆయన ఫొటోను చించేయడంతో తాతబ్బాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News November 21, 2025
ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పరిశోధన ప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్ డా.టి.రవిరాజు అన్నారు. ఉద్దానం ప్రాంతంలో 18% జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.6.01కోట్లు ఖర్చు అవుతుందని అంచానా వేశారు. ఇచ్చాపురం, కంచిలి, పలాస, కవిటి, మందస, వజ్రపు కొత్తరు ప్రాంతాల్లో పరిశోధన చేస్తున్నామన్నారు.
News November 21, 2025
విశాఖ: ‘దళారులకు గంటా వార్నింగ్’

తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ భూములకు శనివారం నుంచి పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎకరాకు రూ.20 లక్షలు, 20 సెంట్ల భూమి ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ధర ఇప్పిస్తామని రైతులను మోసం చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. న్యాయమైన రైతుల కోరికలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
News November 21, 2025
నేడు గ్రేటర్ విశాఖ కౌన్సిల్ సమావేశం

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరగనుండగా ఈ సమావేశంలో చర్చించేందుకు మొత్తం 90 అంశాలతో అజెండాను సిద్ధం చేశారు. వీటిలో ప్రధానంగా నగరంలోని వివిధ వార్డుల అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీ, వాటర్సప్లై వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ముందస్తు వ్యూహరచనలో భాగంగా వైసీపీ తరఫున షాడో సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించారు. సమావేశం ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


