News June 19, 2024
హోం మంత్రి అనిత హెచ్చరిక
గంజాయి, అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై ఉక్కుపాదం మోపుతామని వంగలపూడి అనిత హెచ్చరించారు. హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్చాల్సి ఉందన్నా ఆమె..పోలీస్ స్టేషన్లలో సదుపాయాలను పెంచుతామన్నారు. ఈ ఐదేళ్లలో పనిచేసిన వారు మాత్రమే ఉంటారని హెచ్చరించారు. చట్ట ప్రకారం తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. లా&ఆర్డర్ విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు.
Similar News
News September 19, 2024
విశాఖ: 100 రోజుల పాలనపై మీ కామెంట్ ఏంటి?
ఉమ్మడి విశాఖ జిల్లాలో అరకు, పాడేరు మినహా మిగిలిన అన్ని సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు MLAలు ప్రజలకు వివరించనున్నారు. పెన్షన్ పెంపు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలనలో, మీ MLA పనితీరుపై మీ కామెంట్..
News September 19, 2024
భీమిలి: కూల్చివేతలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
భీమిలి బీచ్‌లో MP విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చివేయాలని జీవీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. రాజకీయ జోక్యంతో కూల్చివేతలను ఆపవద్దని సూచించింది. ఫొటోలను పరిశీలిస్తే బీచ్‌లోనే నిర్మాణాలు చేసినట్లు స్పష్టం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.
News September 19, 2024
విశాఖ: 4,972 మంది లైసెన్సులు తాత్కాలికంగా రద్దు
బైకర్‌లు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రాజారత్నం సూచించారు. గోపాలపట్నంలో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్లు ధరించకుండా ప్రయాణిస్తున్న 4,972 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను మూడు నెలలపాటు తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్‌లో 5,543 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.