News November 30, 2024
హోం మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష: కలెక్టర్

జిల్లా సమీక్షా సమావేశం శనివారం జరుగుతుందని కలెక్టర్ అంబేద్కర్ ఒక తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని జిల్లా అభివృద్ధిపై చర్చిస్తారన్నారు.
Similar News
News October 22, 2025
VZM: ‘సర్దార్ @ 150 కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలి’

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “సర్దార్ @150” కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. స్థానిక నెహ్రూ యువ కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 31 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు జరగనున్న ర్యాలీలు, పోటీల్లో విద్యార్థులు, యువత విరివిగా పాల్గొని పటేల్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు.
News October 22, 2025
విజయనగరం ఉత్సవాలకు రూ.2.02 కోట్ల విరాళాలు: కలెక్టర్

విజయనగరం ఉత్సవాలకు 435 మంది దాతలు మొత్తం రూ.2.02 కోట్లు విరాళంగా అందించారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. వాటిలో రూ.1.41 కోట్లు ఉత్సవాల నిర్వహణకు వినియోగించగా.. మిగిలిన రూ.61 లక్షలు వచ్చే ఏడాది ఉత్సవాలకు ఉంచినట్లు ఆయన వివరించారు. 12 వేదికలపై సాహిత్య, సంగీత, నృత్య కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని, ఉత్సవాల విజయానికి సహకరించిన దాతలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
News October 22, 2025
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వండి: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదులను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. ప్రీ-ఆడిట్ పెండింగ్ ఫిర్యాదులను రెండు వారాల్లో 20% లోపు తగ్గించాలని, SLA గడువు దాటకూడదని స్పష్టం చేశారు. ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసే శాతం 10% కంటే ఎక్కువ కాకుండా చూడాలని సూచించారు.