News November 23, 2024

హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా తేదీల మార్పు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా తేదీలను మార్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సుల మొదటి, మూడు, అయిదో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 30 నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించామని, పరీక్షలను అదే రోజు నుంచి నిర్వహిస్తున్నప్పటికీ, వివిధ పరీక్షా తేదీలను మార్చినట్లు వివరించారు.

Similar News

News December 4, 2024

HYD: గవర్నర్‌ను కలిసిన మంత్రులు

image

రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 5వ తేదిన ఇందిరా మహిళా శక్తి బజార్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

News December 4, 2024

HYD: దివ్యాంగులకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క

image

రవీంద్రభారతిలో జ్యోతి వెలిగించి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లనే మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు.

News December 4, 2024

BREAKING.. HYDలో ఈ ప్రాంతాల్లోనే భూకంపం

image

HYDను భూప్రకంపనలు కాసేపు హడలెత్తించాయి. ఉదయం 7:26 నుంచి 7:31 మధ్య భూమికంపించింది. పలువురు ఇంట్లో వస్తువులు కదిలాయని భయాందోళన చెందారు. హిమాయత్‌నగర్, సరూర్‌నగర్, సురారం, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, యూసుఫ్‌గూడ, లాలాపేట్, బీఎన్‌రెడ్డి, ఉప్పల్, మేడ్చల్, మియాపూర్, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, DSNR, శామీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో సెకన్ల పాటు కంపించింది. మీ ప్రాంతంలో వచ్చిందా కామెంట్ చేయండి.