News February 22, 2025
హోటళ్ల స్వచ్ఛతా ప్రమాణాలకు గ్రీన్ లీఫ్ రేటింగ్: కలెక్టర్

పర్యావరణ హిత స్వచ్ఛత,పారిశుద్ధ్యంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ పర్యాటకులకు మధురానుభూతులు మిగిల్చే హోటళ్లు, లాడ్జిలు వంటి వాటికి ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇవ్వనుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం వెంకయ్య సమావేశ మందిరంలో స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్ సిస్టమ్‌పై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది.
Similar News
News October 31, 2025
మెదక్‌లో ఇందిరాగాంధీపై పోటీ చేసిందెవరంటే..?

ఇందిరాగాంధీపై దివంగత కాంగ్రెస్ నేత, ప్రస్తుత సీఎం మామ అయిన సూదిని జైపాల్ రెడ్డి జనతాపార్టీ తరఫున పోటీ చేశారు. జైపాల్ రెడ్డికి ఆ ఎన్నికల్లో 82,453 ఓట్లు రాగా.. ఇందిరకు 3,01,577 ఓట్లు వచ్చాయి. అనంతరం జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జైపాల్ రెడ్డితో పాటు ఇందిరాగాంధీపై పీవీ నరసింహారావు తనయుడు పీవీ రాజేశ్వరావు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కేశవ్ రావు జాదవ్, గణిత మేధావి శకుంతలా దేవీ సైతం పోటీ చేశారు.
News October 31, 2025
ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి: కవిత

TG: తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో జనంబాట యాత్రలో భాగంగా మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సర్కార్ ప్రకటించిన ఎకరాకు రూ.10వేల పరిహారం ఏ మూలకూ సరిపోదని వ్యాఖ్యానించారు. మొలకెత్తినా, బూజు పట్టినా, తేమ శాతం ఎక్కువగా ఉన్నా ధాన్యం కొనాలన్నారు.
News October 31, 2025
HYD: ‘3 నెలల క్రితమే మంత్రి పదవిపై నిర్ణయం’

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. అజార్‌పై ఉన్న కేసుల గురించి స్పష్టంగా చెప్పాలంటే కిషన్‌రెడ్డి ముందుకు రావాలని సవాల్ విసిరారు. 3 నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవిపై నిర్ణయం తీసుకున్నామని, దీంతో మైనారిటీలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.


