News March 13, 2025
హోలీని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: CP

హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో, సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, లోతట్టు ప్రదేశాల్లో, చెరువుల్లో ప్రాజెక్టులలో స్నానాలు చేయునప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పారు.
Similar News
News March 23, 2025
యానాం సబ్ జైలు గోడదూకి పరారైన ఖైదీ

కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సబ్ జైల్ నుంచి గోడ దూకి ఓ ఖైదీ పరారయ్యాడు. సుమారు 25 అడుగులు సబ్ జైల్ గోడ పైనుంచి దూకి శనివారం పరారైనట్లు సమాచారం. ఒక దొంగతనం కేసులో శనివారం ఉదయం 7 రోజులు రిమాండ్ ఖైదీగా జైలుకి వెళ్లిన కనకాల పేటకు చెందిన కనకాల వెంకటేశ్వర్లు మధ్యాహ్నానికి పరారయ్యాడని చెబుతున్నారు. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
News March 23, 2025
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం: మంత్రి

నేటికి పిల్లలు నేల మీద కూర్చుని చదవటం బాధాకరమని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే అన్ని పాఠశాలలో బల్లలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని పలు మున్సిపల్ పాఠశాలలను ఆయన పరిశీలించారు. వైకుంఠపురంలోని అంగన్వాడి కేంద్రాన్ని మరో భవనంలోకి తరలించాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
News March 23, 2025
మక్తల్: బ్యాక్లాగ్ సీట్ల ప్రవేశాలకు ఆహ్వానం

మహాత్మ జ్యోతిబాఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాలబాలికల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 6, 7, 8, 9వ తరగతుల్లో ఆంగ్ల మీడియంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈ బీసీలకు తెలంగాణ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మక్తల్ ఎంజేపీ ప్రధానాచార్యులు కే హెన్రీ ఒక ప్రకటనలో తెలిపారు.