News March 14, 2025
హోలీలో హద్దులు దాటితే ఉపేక్షించం: ఎస్పీ

హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో జరుపుకోవాలని అన్నమయ్య ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎటువంటి గొడవలకు తావు లేకుండా పండుగను జరుపుకోవాలన్నారు. కానీ హద్దులు దాటితే మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హోలీ పండుగ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News January 7, 2026
సిరిసిల్ల: ‘బాల కార్మికులను బడిలో చేర్పించాలి’

జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బాల కార్మికులను గుర్తించి బడిలో చేర్పించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ఆపరేషన్ స్మైల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 18 ఏళ్లలోపు పిల్లలు భిక్షాటన చేస్తూ గాని, పనిచేస్తూ గానీ కనబడకూడదన్నారు. అలాంటివారు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పించాలని ఆదేశించారు.
News January 7, 2026
జగిత్యాల: ‘ఓటర్ల జాబితా నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి’

ఓటర్ల జాబితా నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో బుధవారం మ్యాపింగ్, ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. కాన్ఫరెన్స్లో జగిత్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్ తదితరులున్నారు.
News January 7, 2026
ములకలచెరువు మద్యం కేసు.. కస్టడీకి నిందితులు

ములకలచెరువు కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న నకిరేకంటి రవి(A16), శ్రీనివాస్ రెడ్డి(A23)ని ఎక్సైజ్ పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. మదనపల్లె సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా వీరిద్దరూ ఉన్నారు. 2రోజుల కస్టడీకి తీసుకోగా.. మదనపల్లె ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడే వీరిని విచారిస్తారని సమాచారం.


