News March 14, 2025
హోలీలో హద్దులు దాటితే ఉపేక్షించం: ఎస్పీ

హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో జరుపుకోవాలని అన్నమయ్య ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎటువంటి గొడవలకు తావు లేకుండా పండుగను జరుపుకోవాలన్నారు. కానీ హద్దులు దాటితే మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హోలీ పండుగ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 12, 2026
నార్త్ కొరియా తదుపరి లీడర్‌గా కిమ్ జు ఏ?

ఉత్తర కొరియా తదుపరి లీడర్‌గా కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె ‘కిమ్ జు ఏ’ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సౌత్ కొరియా నిఘా సంస్థ వెల్లడించింది. ఆమెను తన వారసురాలిగా ప్రకటించేందుకు కిమ్ సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. ఇటీవల ఆమె కీలక సైనిక పర్యటనల్లో పాల్గొనడం, విధాన నిర్ణయాల్లో ఆమె అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి బలం చేకూరుస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
News February 12, 2026
డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ.. సిబ్బంది డుమ్మా

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు ములుగు(మం) రాంచంద్రాపురం, పందికుంట ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాంచంద్రపురం సబ్ సెంటర్ లో సిబ్బంది ఎవ్వరూ విధుల్లో లేరు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మెమోలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. సమయపాలన పాటించకున్నా, ప్రజలకు అందుబాటులో లేకున్నా చర్యలు తప్పవన్నారు. తర్వాత పందికుంట అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.
News February 12, 2026
మంచిర్యాల: స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూములను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.


