News March 14, 2025

హోలీ పండుగ.. కోనసీమ ఎస్పీ సూచనలు

image

హోలీ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సీసీటీవీల ద్వారా హోలీ వేడుకలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లు బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై రంగులు చల్లటం వంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. హోలీలో ఎటువంటి రసాయనిక రంగులను వాడొద్దని ఎస్పీ సూచించారు.

Similar News

News April 14, 2026

సిద్దిపేటలో ఏప్రిల్ 25న మెగా జాబ్ మేళా

image

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్దిపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఉద్యోగ మిత్ర’ మెగా జాబ్ మేళాకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 25న ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాల్ తెలిపారు. ఈ జాబ్ మేళా ఏర్పాట్లపై సోమవారం మర్కూక్ పోలీస్ స్టేషన్‌లో కంపెనీ ప్రతినిధులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 14, 2026

ఇరాన్‌తో మరోసారి అమెరికా చర్చలు?

image

కాల్పుల విరమణ గడువు ముగియక ముందే మరోసారి ఇరాన్‌తో చర్చించాలని అమెరికా భావిస్తోంది. ఎప్పుడు, ఎక్కడ భేటీ కావాలనేది ఇంకా నిర్ణయించలేదని CNN తెలిపింది. 2 దేశాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పినట్లు పేర్కొంది. మరోవైపు యురేనియం శుద్ధిని 20 ఏళ్లు నిలిపేయాలని తొలి దశ చర్చల్లో US ప్రతిపాదించిందని Axios తెలిపింది. చర్చలు విఫలం కావడానికి ఈ డిమాండే ముఖ్య కారణమని పేర్కొంది.

News April 14, 2026

పరమాత్ముడు ఒక్కడే.. ఈ సత్యాన్ని తెలుసుకోండి

image

కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు
యుప్పు లవణ మండ్రు యొకటి గాదె?
భాషలింతె వేఱు పరతత్వమొకటే
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: కొన్ని పదాలకు ఒకే అర్థంలో పర్యాయపదాలుంటాయి. కుండను కుంభం, ఉప్పును లవణం, కొండను పర్వతం అంటారు. అలాగే దేశంలో కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు ఎన్ని ఉన్నా ఆ పరమాత్ముడు ఒక్కడే. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవడం ముఖ్యం.
<<-se>>#PADHYAM<<>>