News March 13, 2025

హోలీ పండుగ.. తిరుపతి ఎస్పీ సూచనలు

image

తిరుపతి జిల్లా ప్రజలకు ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.  ఆయన మాట్లాడుతూ..ఆనందంతో హద్దులు మీరి ప్రవర్తించవద్దని తెలిపారు. ఐక్యతతో మతసామరస్యానికి ప్రతీకగా హోలీ పండుగ జరుపుకుందామని పిలుపునిచ్చారు. పండుగ పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించి, ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. మహిళలపై రంగులు చల్లి అసభ్యంగా ప్రవర్తించడం వద్దన్నారు.

Similar News

News March 15, 2025

గద్వాల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మ‌ృతి

image

అంతర్ రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. మానవపాడు మం. చెన్నిపాడుకి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి (34) తన తల్లి సుబ్బమ్మతో కలిసి కలుగొట్ల గ్రామంలో నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో అలంపూరు చౌరస్తా నుంచి శాంతినగర్ వెళ్లేదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.

News March 15, 2025

నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి డాక్టర్ ఏ. శ్రీనివాసులు తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల జనరల్ విభాగంలో 23,199 మందికి గాను 458 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 431 మందికి గాను 61 మంది గైర్హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో జిల్లా అధికారులందరికీ ఆర్‌ఐ‌ఓ ధన్యవాదాలు తెలిపారు.

News March 15, 2025

మళ్లీ నేనే సీఎం: రేవంత్ రెడ్డి

image

TG: రెండోసారి కూడా తానే సీఎం అవుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ‘తొలిసారి BRSపై వ్యతిరేకతతో మాకు ఓటు వేశారు. రెండోసారి మాపై ప్రేమతో వేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నా పనిని నమ్ముకుని ముందుకు వెళ్తున్నా. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం’ అని తెలిపారు.

error: Content is protected !!