News March 13, 2025

హోలీ పండుగ.. వరంగల్ సిటీలో పోలీసుల నజర్

image

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీసులు ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అదేశించారు. హోలీ వేళ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే వారితో పాటు.. మహిళలు, యువతులపై వారి అనుమతి లేకుండా రంగులు జల్లే వారిపై పోలీసులు నజర్ పెట్టాలన్నారు. ట్రై సిటీ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Similar News

News November 15, 2025

అయ్యప్ప స్వాములకు తప్పక తెలియాల్సిన ప్రాంతం

image

అయ్యప్ప స్వామితో యుద్ధంలో మహిషి అనే రాక్షసి మొండెం పడిన ప్రదేశాన్ని ‘ఎరుమేలి’ అని అంటారు. దీన్నే ‘కొట్టబడి’ అని పిలుస్తారు. శబరిమల యాత్రలో ఎరుమేలికి చేరుకున్న భక్తులు ‘స్వామి దింతకతోమ్… అయ్యప్ప దింతకతోమ్’ అని ‘పేటత్తుళ్లి’ అనే సాంప్రదాయ నృత్యం చేస్తారు. ఇది మహిషిపై సాధించిన విజయాన్ని గుర్తుచేస్తుంది. ఎరుమేలి అయ్యప్ప భక్తులకు ఓ ముఖ్యమైన ఆరంభ స్థానంగా, పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. <<-se>>#AyyappaMala<<>>

News November 15, 2025

179 పోస్టులకు నోటిఫికేషన్

image

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (<>CAU<<>>), ఇంఫాల్ 179 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, PG, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://cau.ac.in/

News November 15, 2025

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం జడ్పీ స్కూల్‌ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి రోజు విద్యార్థి పాఠశాలకు వచ్చేలా చూడాలని, పాఠశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు ఫోన్ చేసి పిలిపించాలని తెలిపారు. పది విద్యార్థులకు బోధించే టీచర్లకు అత్యవసరమైతే తప్ప సెలవులు ఇవ్వొద్దని HMకు సూచించారు.