News March 13, 2025

హోలీ పండుగ.. వరంగల్ సిటీలో పోలీసుల నజర్

image

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీసులు ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అదేశించారు. హోలీ వేళ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే వారితో పాటు.. మహిళలు, యువతులపై వారి అనుమతి లేకుండా రంగులు జల్లే వారిపై పోలీసులు నజర్ పెట్టాలన్నారు. ట్రై సిటీ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Similar News

News February 11, 2026

శివ‌రాత్రికి ప‌క్కా ఏర్పాట్లు: కలెక్టర్

image

శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా శివాల‌యాల్లో భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. శివ‌రాత్రి పండుగ ఏర్పాట్ల‌తోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత పనులు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయి అధికారులతో వీసీలో సుదీర్ఘంగా సమీక్షించారు. ద‌ర్శ‌నాల‌కు ఎటువంటి ఆటంకాలు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని సూచించారు.

News February 11, 2026

రామప్ప బోటింగ్ యూనిట్‌ తాత్కాలిక బంద్!

image

మహా శివరాత్రి సందర్భంగా రామప్పకు భక్తులు, పర్యాటకులు భారీగా రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఫిబ్రవరి 15, 16న రామప్ప బోటింగ్ యూనిట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ములుగు కలెక్టర్ తెలిపారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News February 11, 2026

EXIT POLLS.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలా..!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 3-5 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 2-4 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP 2-3, MIM 1, ఇతరులు ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.