News March 14, 2025
హోలీ సంబరాల్లో సంగారెడ్డి ఎస్పీ

సంగారెడ్డిలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు శుక్రవారం నిర్వహించారు. కార్యాలయ ఉద్యోగులు, పోలీసులు ఎస్పీ రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. సహజమైన రంగులతోనే పండగ జరుపుకోవాలని చెప్పారు. చెరువులు, కుంటల వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Similar News
News March 15, 2025
భారత్కు రావొద్దని నన్ను బెదిరించారు: వరుణ్ చక్రవర్తి

2021 టీ20 వరల్డ్ కప్లో ప్రదర్శన అనంతరం తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవని భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘స్వదేశానికి రావొద్దని నన్ను బెదిరించారు. చెన్నై వచ్చాక కూడా ఎవరో నన్ను ఇంటివరకూ ఫాలో అయ్యారు. అది నాకు చాలా కష్టమైన దశ. నమ్మకంతో జట్టుకు సెలక్ట్ చేస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోయానన్న బాధతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. చాలా బాధపడ్డాను’ అని గుర్తుచేసుకున్నారు.
News March 15, 2025
సిద్దిపేట: గ్రూప్-3లో సత్తా చాటిన యువకుడు

తొగుట గ్రామానికి చెందిన ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ గ్రూప్-3 ఫలితాలలో సత్తా చాటాడు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 232 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్-4 ఆఫీసర్గా HMDAలో విధులు నిర్వహిస్తున్నాడు. తన ప్రిపరేషన్ కొనసాగిస్తూ గ్రూప్-1 సాధించి డీఎస్పీ అవ్వడమే తన లక్ష్యమని ముచ్చర్ల శ్రీకాంత్ తెలిపాడు.
News March 15, 2025
ధనికులుగా మారేందుకు హర్ష్ గోయెంకా చిట్కాలు

ఆర్థిక క్రమశిక్షణతో ధనికులుగా మారేందుకు వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా Xలో చెప్పిన టిప్స్ వైరలవుతున్నాయి.
* సంపదను సృష్టించే ఆస్తులను సంపాదించండి
* సంపాదించే దాని కన్నా తక్కువ ఖర్చు చేయండి
* ఆదాయంతో పాటు సంపదను సృష్టించడంపై దృష్టి పెట్టండి
* ఆర్థిక ఐక్యూను మెరుగుపరచుకొండి
* సంపదను పెంచే అవకాశాలను చూడండి
* మనీ కోసమే కాకుండా నేర్చుకునేందుకు పనిచేయండి