News March 14, 2025

హోలీ సంబరాల్లో సంగారెడ్డి ఎస్పీ

image

సంగారెడ్డిలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు శుక్రవారం నిర్వహించారు. కార్యాలయ ఉద్యోగులు, పోలీసులు ఎస్పీ రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. సహజమైన రంగులతోనే పండగ జరుపుకోవాలని చెప్పారు. చెరువులు, కుంటల వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Similar News

News April 20, 2025

సిరిసిల్ల: ఓపెన్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

సిరిసిల్ల జిల్లాలో నిర్వహించే ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు మరో పరీక్ష జరుగుతుందని చెప్పారు. జిల్లాలో మొత్తం (4) పరీక్షా కేంద్రాలలో పదో తరగతి 298, ఇంటర్ 856 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.

News April 20, 2025

ఏలూరు: ఊరేసుకుని వ్యక్తి మృతి

image

ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి తూర్పు వీధికి చెందిన దుర్గారావు (34) ఊరేసుకుని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతిపై సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి 2 ఏళ్ల క్రితం వివాహమైందన్నారు. ఈనెల 18న రాత్రి భార్యతో గొడవపడి రూమ్‌లోకి వెళ్లాడని భార్య చెప్పింది. శనివారం తలుపు తీస్తే ఊరికి వేలాడుతూ కనిపించాడని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.

News April 20, 2025

పోతంగల్: కొడుకు పెళ్లి.. తండ్రి మృతి

image

తెల్లవారితే కొడుకు పెళ్లి ఉండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. రుద్రూర్‌కు చెందిన నాగయ్య(52) తన కొడుకు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకే శనివారం పోతంగల్‌లోని కారేగాంకు బైక్ పై వెళుతుండగా హంగర్గ ఫారం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టాడు. అతడు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!