News August 13, 2024
హోల్డింగ్ స్ట్రక్చర్ల నిర్మాణంతో వరద నీటికి చెక్

రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా బల్దియా చర్యలు చేపట్టింది. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హోల్డింగ్ స్ట్రక్చర్లను నిర్మిస్తోంది. ఇందుకు లక్ష, 5లక్షలు, 10లక్షల లీటర్ల కెపాసిటీతో పాయింట్ల వారీగా ట్యాంకుల నిర్మాణాలను చేపడుతోంది. గ్రేటర్ సిటీలో రూ.10కోట్లతో 50 ప్రాంతాల్లో నిర్మించనుంది. ఇటీవల అసెంబ్లీ సెషన్స్లోనూ వీటిపైన సీఎం రేవంత్ రెడ్డి విషయాన్ని ప్రస్తావించారు.
Similar News
News January 3, 2026
HYD: లీకేజీలను గుర్తించేంచుకు ‘రోబోటిక్’ టెక్నాలజీ

HYDలో కలుషిత నీటి సరఫరాను అరికట్టేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. గత రెండేళ్లలో అందిన ఫిర్యాదులను విశ్లేషించి, కలుషిత నీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో రెండు నెలల్లోగా పాత పైప్లైన్లను మార్చాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. లీకేజీలను త్వరితగతిన గుర్తించేందుకు ‘రోబోటిక్ టెక్నాలజీ’ని వాడుతున్నారు. ఫిర్యాదులను ‘జీరో’ స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు పనులు చేపట్టారు.
News January 3, 2026
లింగంపల్లి-ఉప్పల్: నిధుల కరవు.. అధికారాల పరువు!

శేరిలింగంపల్లి నుంచి ఉప్పల్ దాకా అతుకుల రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీలే దర్శనమిస్తున్నాయి. సుమారు రూ. 14,725 కోట్ల పనులు పెండింగ్లో ఉండటంతో ప్రతి వానాకాలం వేలాది కుటుంబాలు ముంపులోనే బతుకుతున్నాయి. విచిత్రమేంటంటే.. ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్లకు రూ. 5 లక్షలకు మించి ఖర్చు చేసే అధికారం లేదు. అంటే, ఒక చిన్న డ్రైనేజీ కాలువ పూడిక తీయాలన్నా పైస్థాయి నుంచి <<18752122>>పచ్చజెండా<<>> రావాల్సిందే.
News January 3, 2026
హైదరాబాద్ చుట్టూ ‘నరక’ కూపాలు!

హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ, మెట్రో రైళ్లే అనుకుంటున్నారా? నగరం చుట్టూ కొత్తగా చేరిన ఆ 27 మున్సిపాలిటీల (ULBs) వైపు వెళ్తే.. ‘అభివృద్ధి’ అనే మాటకే అర్థం మారిపోతోంది! 1,324 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతాల్లో పరిస్థితి చూస్తుంటే.. భవిష్యత్తులో ఇవి మురికివాడలుగా మారతాయా? అన్న భయం వేస్తోంది.


