News March 8, 2025

హోళీ సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు 

image

హోళీ సందర్భంగా విజయవాడ మీదుగా తాంబరం(TBM), సత్రాగచ్చి(SRC) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 13,20న TBM- SRC(నం.06095), ఈనెల 14,21న SRC-TBM(నం.06096) ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో శ్రీకాకుళం రోడ్, పలాస, విజయనగరం, సింహాచలం నార్త్, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, గూడూరు స్టేషన్లలో ఆగుతాయని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

Similar News

News October 30, 2025

అక్టోబర్ 30: చరిత్రలో ఈరోజు

image

1883: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి మరణం
1909: భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబా జననం (ఫొటోలో)
1945: ఐక్యరాజ్యసమితిలో భారత్ సభ్య దేశంగా చేరింది
1987: సినీ దర్శకుడు రాజాచంద్ర మరణం
1990: దర్శకుడు, నిర్మాత, నటుడు వి.శాంతారాం మరణం
✒ ప్రపంచ పొదుపు దినోత్సవం

News October 30, 2025

మెడికల్ కాలేజీలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ కోర్సుల్లో సీట్ల భర్తీకై అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శ్రీహరి రావు తెలిపారు. DMLT 30 సీట్లు, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ 30 సీట్లు కోర్సులకు ఇంటర్‌లో BIPC, MPC, ఆర్ట్స్ గ్రూప్ చదివిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తులను నవంబర్ 27వ తేదీ వరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో అందజేయాలని ఆయన సూచించారు.

News October 30, 2025

NZB: బాబ్లీ ప్రాజెక్టులోకి వరద.. పాక్షికంగా కొన్ని గేట్లు ఎత్తివేత.!

image

నిజమాబాద్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్టులోకి పైనుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో, అధికారులు పాక్షికంగా కొన్ని గేట్లను ఎత్తివేశారు. వరద ప్రవాహం ఉన్నంత వరకు గేట్లను తెరిచి ఉంచుతామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో SRSP SE వి.జగదీష్, AEE కొత్త రవి, CWC EE ఫ్రాంక్లిన్, SDE ఏ.సతీష్, నాందేడ్ EE C.R. బన్సాద్ తదితరులు పాల్గొన్నారు.