News February 27, 2025

హ్యాట్సాఫ్.. విశాఖ పోలీస్..!

image

మహా శివరాత్రి సందర్భంగా గురువారం విశాఖలో భక్తులు పెద్దఎత్తున సముద్ర స్నానాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా విశాఖ పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. పుణ్య స్నానాలు ఆచరిస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలోకి వెళ్లిపోయిన ఆరుగురిని గజ ఈతగాళ్ల సాయంతో రక్షించారు. జనసంద్రంలో తప్పిపోయిన 10 మంది చిన్నారులను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

Similar News

News February 28, 2025

విశాఖ: మెడికల్ స్టోర్ ముందే మృతి.. వివరాలు ఇవే

image

డాబా గార్డెన్ వద్ద గల నీలమ్మ వేప చెట్టు సమీపంలో మెడికల్ స్టోర్ వద్ద గురువారం ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే.అతడు మందులు కొనడానికి వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న 108 సిబ్బంది అతడు మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి వద్ద మందుల చీటీ మాత్రమే ఉండడంతో టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలానికి చెందిన రమణ (60)గా గుర్తించారు.

News February 28, 2025

గాజువాకలో చిన్నారిపై అత్యాచారయత్నం

image

గాజువాకలో ఓ చిన్నారిపై అత్యాచారయత్నం జరిగినట్లు గాజువాక పోలీసులకు ఫిర్యాదు అందింది. ఐదు సంవత్సరాల చిన్నారికి సన్నీబాబు అనే వ్యక్తి గురువారం మాయ మాటలు చెప్పి అత్యాచారానికి యత్నించడంతో ఆ చిన్నారి కేకలు వేసి తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి నిందితుడిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

News February 28, 2025

విశాఖలో ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి

image

బైక్‌పై ప్రయాణించేవారికి హెల్మెట్ ధారణ తప్పనిసరి అని విశాఖ ఉప రవాణా కమీషనర్ ఆర్‌సి‌హెచ్ శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బైక్ నడిపే వ్యక్తి, వెనుక కూర్చున్న వ్యక్తి ఇద్దరూ హెల్మెట్ ధరించాలన్నారు. ఏ ఒక్కరు హెల్మెట్ ధరించకపోయినా జరిమానా విధిస్తామన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్సు 3 నెలలు సస్పెండ్ చేసి, ఫైన్ వేస్తామన్నారు.

error: Content is protected !!