News December 18, 2024
హ్యాపీ బర్త్ డే రామ్మోహన్ నాయుడు
రామ్మోహన్ నాయుడు.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందారు. బుల్లెట్ లాంటి మాటలు, సబ్జెక్ట్‌పై పట్టు, క్రమ శిక్షణతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 26ఏళ్లకే పార్లమెంట్‌కు ఎన్నికై అనతి కాలంలోనే తన మార్క్ చూపించారు. పార్లమెంట్లో అనర్గళంగా మాట్లాడుతూ ఎంతో మంది ప్రశంసలు పొందారు. గత ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం అందుకున్న ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. చిన్న వయసులో ఆ పదవి పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
Similar News
News January 5, 2025
గార: ఉప్పు గెడ్డలో పడి వృద్ధురాలి మృతి
గార మండలం శ్రీకూర్మం పంచాయతీ జెల్లపేటకు చెందిన గండ్రేటి కృష్ణమ్మ (74) ప్రమాదవశాత్తు ఉప్పు గెడ్డలో జారి పడి మృతి చెందింది. శనివారం గార వెళ్తానని చెప్పిన కృష్ణమ్మ బందరువానిపేట వద్ద ఉన్న ఉప్పు గెడ్డలో పడి మరణించడంతో కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ జనార్దన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేశారు.
News January 5, 2025
పాలవలసలో మొదలైన సంక్రాంతి సందడి
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలసలో గంగిరెద్దుల రాకతో సంక్రాంతి సందడి మొదలైంది. ‘అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు’ అని ఎద్దుల బసవన్నలు ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. అందర్నీ దీవించి వాళ్ళు ఇచ్చిన పండగ కానుకలని స్వీకరిస్తూ వెళుతున్నారు. సన్నాయి చప్పుళ్ల నడుమ గంగిరెద్దుల నృత్యం చేశాయి. ప్రతీ ఏటా ఈ గంగిరెద్దులతో రాకతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటోంది.
News January 5, 2025
సంతబొమ్మాలి: వీర జవాన్ భార్యకు కేంద్ర ప్రభుత్వం పురస్కారం
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నరసాపురానికి చెందిన వీర జవాన్ ఆదినారాయణ భార్య కమలమ్మకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో పురస్కారం అందజేసింది. ఢిల్లీలో యుద్ధస్మారక స్తూపం వద్ద ఈ పురస్కారాన్ని అందజేశారు. 11వ అస్సాం రైఫిల్ బెటాలియన్‌కు చెందిన ఆయన ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆదినారాయణకు నివాళులర్పిస్తూ భార్య కమలమ్మకు పురస్కారాన్ని అందజేశారు.