News February 16, 2025
హ్యూమన్ రైట్స్ బాపట్ల జిల్లా ఛైర్మన్గా శివప్రసాద్

హ్యూమన్ రైట్స్ బాపట్ల జిల్లా ఛైర్మన్గా వెంకట నాగ శివప్రసాద్ను నియమిస్తూ జాతీయ ఛైర్మన్ సిరాజుద్దీన్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ.. బాపట్ల జిల్లాలో ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి అవగాహన కల్పిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం నుంచి అందవలసిన పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News November 22, 2025
కంచిలి: “సేవలను సద్వినియోగం చేసుకోవాలి”

కంచిలి మండలం ఎంఎస్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలను శనివారం రాష్ట్ర పీఎంశ్రీ పాఠశాలల సీనియర్ లెక్చలర్ పుల్లట రమేష్ సందర్శించారు. పీఎంశ్రీ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో రకాల నిధులు మంజూరు చేస్తుందని పుల్లట రమేష్ అన్నారు. ప్రతి ఒక్కరూ వీటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కంచిలి ఎంఈఓ-2 కుంబి చిట్టిబాబు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయండి: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) సరఫరాను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా మిల్లర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం విధించిన గడువులు ముగుస్తున్న నేపథ్యంలో మిల్లర్లు సన్నబియ్యం మిల్లింగ్, సిఎంఆర్ సరఫరా పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమయానికి సిఎంఆర్ సరఫరా చేయని మిల్లర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.


