News November 18, 2024
ఆ వివరాలు వెల్లడించకపోతే ₹10లక్షల ఫైన్: IT
ITR ఫైల్ చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని వెల్లడించాలని IT శాఖ తెలిపింది. ఒకవేళ ఆ వివరాలు వెల్లడించకపోతే బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్ 2015 కింద రూ.10లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, బీమా ఒప్పందాలు, ట్రస్టులు, ఇతర ఆస్తుల వివరాలను తెలపాలని సూచించింది. సవరించిన ITR ఫైల్ చేసేందుకు గడువు DEC 31తో ముగియనుంది.
Similar News
News November 18, 2024
త్వరలో కీరవాణి కుమారుడి పెళ్లి
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగను ఆయన వివాహమాడనున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్లో వీరి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ప్రిన్స్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి, నటులు నరేశ్, పవిత్ర, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తదితరులు హాజరయ్యారు.
News November 18, 2024
వెంటనే IR ప్రకటించాలి: APTF
APలో NDA ప్రభుత్వం ఏర్పడి 5 నెలలైనా ఇంకా టీచర్లు, ఉద్యోగులకు ఎలాంటి భరోసా కల్పించలేదని APTF ఆరోపించింది. పెండింగ్ DAలు, వేతన సవరణ గడువు రెండేళ్లు దాటినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని మండిపడింది. గత ప్రభుత్వం నియమించిన PRC కమిషన్ ఛైర్మన్ ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేశారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరింది. PRC ప్రకటించే వరకూ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేసింది.
News November 18, 2024
PDS ధాన్యం పక్కదారి.. రూ.69 వేల కోట్ల నష్టం
PDS ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేసిన ఆహార ధాన్యాలు పక్కదారి పట్టడంతో ₹69 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు ఎకానమిక్ థింక్ ట్యాంక్ అధ్యయనంలో తేలింది. 28% లబ్ధిదారులకు ధాన్యం చేరడం లేదని వెల్లడైంది. ఆగస్టు, 2022-జులై, 2023 మధ్య కాలానికి సంబంధించి సంస్థ అధ్యయనం చేసింది. ధాన్యాన్ని ఓపెన్ మార్కెట్, ఇతర ఎగుమతులకు మళ్లించివుంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.