News February 8, 2025
27 ఏళ్ల బీజేపీ కరవు తీర్చిన ₹12L ట్యాక్స్ మినహాయింపు!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో కమలం గెలుపు దాదాపు ఖాయమేనని విశ్లేషకుల అంచనా. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు మిడిల్ క్లాస్‌ను బీజేపీ వైపు తిప్పిందని పేర్కొంటున్నారు. అలాగే పదేళ్ల ఆప్ పాలనపై వ్యతిరేకత, కాంగ్రెస్ ఓట్లు చీల్చడం కూడా కలిసొచ్చిందని చెబుతున్నారు.
Similar News
News March 25, 2025
రానున్న 4 రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రంలో రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణం కంటే 2-3°C ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. వారం నుంచి పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వేడిగాలులతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గాయి. అలాగే ఈ నెల 30 వరకు వర్షాలు పడే ఆస్కారం లేదని, పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. వడదెబ్బ సోకకుండా ప్రజలు నీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News March 25, 2025
నేనెప్పుడు కేసీఆర్‌ను కించపరచలేదు: జూపల్లి

TG: తానెప్పుడూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కించపరచలేదని, భవిష్యత్తులోనూ కించపరచబోనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనంటే ఉద్యమం నుంచి గౌరవం ఉందని చెప్పారు. అయితే సోనియాగాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. మూడు లక్షల అదనపు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
News March 25, 2025
7.81L సిమ్ కార్డులు, 83K వాట్సాప్ ఖాతాలు బ్లాక్: బండి

ప్రజలను తప్పుదోవ పట్టించడం, డిజిటల్ అరెస్టుల పేరిట మోసాలు చేస్తున్న వారిని కట్టడి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ ఏడాది FEB వరకు 7.81L సిమ్ కార్డులు, 83K వాట్సాప్ ఖాతాలను, 2.08L IMEIలను బ్లాక్ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.4,386 కోట్లను కాపాడినట్లు పార్లమెంటులో సమాధానమిచ్చారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు https://cybercrime.gov.in పోర్టల్‌ను ప్రారంభించామన్నారు.