News October 6, 2024

రిలయన్స్ వల్ల ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు ₹24 కోట్ల న‌ష్ట‌ం

image

రిల‌య‌న్స్‌ సంస్థతో స్పాన్సర్‌షిప్ ఒప్పంద త‌ప్పిదాల వ‌ల్ల భారత ఒలింపిక్ సంఘానికి ₹24 కోట్ల న‌ష్ట‌ం వాటిల్లిన‌ట్టు కాగ్ లెక్క‌గ‌ట్టింది. 2022-2028 వరకు ఆసియా క్రీడ‌లు, కామ‌న్వెల్త్ గేమ్స్‌, Olympicకు Principal Partnerగా రిల‌య‌న్స్‌తో ఒప్పందం జరిగింది. త‌దుప‌రి 2026-30 వింట‌ర్ ఒలింపిక్స్‌, యూత్ ఒలింపిక్ హ‌క్కుల‌నూ రిల‌య‌న్స్‌కు కేటాయించారు. కానీ ఆ మేరకు నిధుల ఒప్పందం జ‌ర‌గ‌లేద‌ని కాగ్ పేర్కొంది.

Similar News

News April 5, 2026

నేడు SRH మ్యాచ్.. HYDకు వర్షసూచన ఉందా?

image

IPL: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఇవాళ SRH, LSG తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో HYD వాతావరణ కేంద్రం అప్డేట్ ఇచ్చింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈదురు గాలులతో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. SRH మ్యాచ్ 3.30 గంటలకు కావడంతో వర్షం పడినా పెద్దగా అంతరాయం కలగకపోవచ్చు. ఇవాళ SRH, LSGలలో ఏ జట్టు గెలుస్తుంది?

News April 5, 2026

మరో అమెరికన్ ఫ్లైట్‌ను కూల్చేసిన ఇరాన్?

image

ఇరాన్‌లో కూలిన F-15E యుద్ధ విమానంలోని రెండో పైలట్‌ను కాపాడినట్లు ట్రంప్ ప్రకటించిన గంటల్లోనే అమెరికాకు మరో షాక్ తగిలినట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న మరో విమానాన్ని కూల్చినట్లు IRGC ప్రకటించింది. ఇస్ఫహాన్ సౌత్‌లో ఈ ఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అమెరికా ఇంకా ధ్రువీకరించలేదు.

News April 5, 2026

బాలీవుడ్‌లో దారుణమైన అంశమిదే: డైరెక్టర్ ప్రియదర్శన్

image

బాలీవుడ్‌ కల్చర్‌పై ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ అసహనం వ్యక్తం చేశారు. ‘అక్కడ సెట్‌లో నలుగురు యాక్టర్లతో పాటు 40-60 వర్కర్లు ఉంటారు. నటులకు జుట్టు లేకపోయినా సరిచేస్తూ, తాకుతూ ఉంటారు. నటుల చుట్టూ ఉండే సామగ్రి నా డైరెక్షన్ సెటప్ కంటే ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్‌లో కొనసాగుతున్న దారుణమైన అంశం ఇదే. ఇలాంటివి నాకు నచ్చవు. సౌత్ ఇండస్ట్రీలో ఇలా ఉండదు. వర్కర్లు సెట్‌కు బయటే ఉంటారు’ అని పేర్కొన్నారు.