News December 16, 2024
₹37,000 CR: పన్ను ఎగ్గొట్టినోళ్ల నుంచి వసూలు

పన్ను ఎగవేతదారులపై IT శాఖ కొరడా ఝుళిపించింది. అధిక ఆదాయం పొందుతూ ITR దాఖలు చేయనివారి నుంచి 20 నెలల్లోనే రూ.37,000 కోట్లు వసూలు చేసింది. ఎగవేతదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు ప్రభుత్వం డేటా అనలిటిక్స్, నాన్ ఫైలర్ మానిటరింగ్ సిస్టమ్ (NMS), TDSలను ప్రాసెస్ చేసింది. లగ్జరీ స్పెండింగ్, బంగారం, నగలు, వజ్రాలను మొత్తం నగదు రూపంలో కొనుగోలు చేసి ITRఫైల్ చేయని వారిని గుర్తించి తనిఖీలు చేపట్టింది.
Similar News
News September 18, 2025
మోదీకి విషెస్ జెన్యూన్ కాదన్న యూట్యూబర్‌పై విమర్శలు

ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు జెన్యూన్ కాదని యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. ప్రముఖులు విష్ చేసేలా ఆయన టీమ్ ముందే వారికి ‘టూల్ కిట్’ ఇచ్చిందన్నారు. దీంతో ధ్రువ్ రాథీపై మోదీ అభిమానులు ఫైరవుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్‌కు కూడా ‘టూల్ కిట్’ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.
News September 18, 2025
అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
News September 18, 2025
రాష్ట్రంలో 21 పోస్టులు

<