News December 30, 2024
₹40K CR: గొడవలున్నా భారత షేర్లలో చైనా బ్యాంకు పెట్టుబడి!

సరిహద్దు వివాదం నెలకొన్నప్పటికీ భారత్‌లో చైనా సెంట్రల్ బ్యాంకు (PBOC) భారీ పెట్టుబడులే పెట్టింది. 2024లో రూ.40వేల కోట్ల విలువైన 35 కంపెనీల స్టాక్స్‌ను హోల్డ్ చేసింది. అత్యధికంగా ICICIలో రూ.6139CR, HDFC BANKలో రూ.5303CR, TCSలో రూ.3619CR, పవర్‌గ్రిడ్‌లో రూ.1414CR, కొటక్ బ్యాంకు, HUL, బజాజ్ ఫైనాన్స్‌లో మొత్తంగా రూ.1500CRను ఇన్వెస్ట్ చేసింది. FDIకి అనుమతి లేకపోవడంతో చైనా FPI, FIIల మార్గం ఎంచుకుంది.
Similar News
News December 8, 2025
పాడేరు: టెన్త్ పరీక్షా ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 9వరకు ప్రభుత్వం పొడిగించినట్లు అల్లూరి DEO బ్రహ్మాజీరావు సోమవారం తెలిపారు. రూ.50 పెనాల్టీతో ఈనెల 12, రూ.200ల పెనాల్టీతో 15, రూ.500ల పెనాల్టీతో 18వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. అల్లూరి జిల్లాలో 244 విద్యాలయాల్లో 11,354మంది పదో తరగతి విద్యార్థులున్నారన్నారు. అందరూ పరీక్షలకు హాజరు అయ్యేలా టీచర్స్ కృషి చేయాలన్నారు.
News December 8, 2025
ఈ హాస్పిటల్లో అన్నీ ఉచితమే..!

AP: వైద్యం కాస్ట్లీ అయిపోయిన ఈరోజుల్లో ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందిస్తోంది కూచిపూడిలోని(కృష్ణా) రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. 200 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు అన్నీ ఉచితమే. దాదాపు 70 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. పేదల సంజీవనిగా పేరొందిన ఈ హాస్పిటల్‌ను సందర్శించిన బీజేపీ నేత యామిని శర్మ ట్వీట్ చేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది.
News December 8, 2025
సరసమైన ధరలున్నా.. BSNLవైపు మళ్లట్లేదు!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల రూ.485 ప్లాన్(72 రోజులు డైలీ 2GB డేటా) తీసుకొచ్చింది. ఇలాంటి ఎన్నో ప్లాన్స్ ఉన్నా యూజర్లు BSNLవైపు మళ్లట్లేదని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ప్రైవేట్ సంస్థలు 5G సేవలు అందిస్తుండగా BSNL ఇంకా 4Gకే పరిమితమైంది. డేటా స్పీడ్ తగ్గడం, కాల్ డ్రాప్స్, నెట్వర్క్ కవరేజ్ సమస్యల వల్లే ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారు’ అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?


