News December 16, 2024
₹4,67,00,000.. ఇది గుకేశ్ కట్టాల్సిన పన్ను!

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన గుకేశ్ భారీ మొత్తంలో Tax కట్టాల్సి ఉంది! ప్రైజ్‌మనీ కింద ఆయనకు ₹11.34 కోట్ల నగదు పురస్కారం దక్కినట్టు తెలుస్తోంది. దీనిపై ₹3 Cr వరకు ఆయన పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఇతర సర్‌ఛార్జ్‌ల కింద మొత్తంగా ₹4.67 కోట్ల వరకు Tax కట్టాల్సి ఉంటుందని నిపుణులు లెక్కగడుతున్నారు. గుకేశ్ నికర ఆస్తి ₹21 కోట్లకు పెరగడంతో 30% స్లాబ్ కింద లెక్కలేస్తున్నారు.
Similar News
News November 27, 2025
దక్షిణామూర్తి ఎవరు?

దక్షిణామూర్తి సకల విద్యలకు, తత్వజ్ఞానానికి ఆది గురువు. ఆయన మౌనంగా ఉంటూనే కేవలం చిన్ముద్ర ద్వారా శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారు. ఆయనను పూజిస్తే అజ్ఞానం తొలగి, బుద్ధి వికసించి, ఏకాగ్రత పెరుగుతుందని నమ్మకం. గురువు లేనివారు ఆయనను తమ సద్గురుగా భావించి పూజిస్తారు. శ్రీరాముడి గురువు అయిన వశిష్టుడు కూడా ఈయన దగ్గరే బ్రహ్మవిద్యను సంపాదించాడని పురాణాలు చెబుతున్నాయి.
News November 27, 2025
భారత్ వైట్ వాష్.. తప్పెవరిది?

SAతో 2 టెస్టుల్లోనూ ఘోరంగా ఓడిపోవడాన్ని భారత ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాటర్ల డిఫెన్స్ టెక్నిక్ పేలవంగా ఉందని, T20 ఫార్మాట్ అలవాటై గంటల కొద్దీ బ్యాటింగ్ చేసే ఓపిక నశించిందని అంటున్నారు. అటు ఎక్కువశాతం కోచ్ గంభీర్‌పై ఫైర్ అవుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు, టీం సెలక్షన్ సరిగా చేయలేకపోతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇంతకీ వైట్ వాష్‌కి కారణం ప్లేయర్లా, కోచ్ గంభీరా? కామెంట్ చేయండి.
News November 27, 2025
ఆవు పేడతో అలుకుత ఎందుకు చల్లాలి?

పూజలు, శుభకార్యాల సమయంలో ఆవు పేడతో అలుకుత చల్లే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. నిజానికి ఆవు పేడ ఒక అద్భుతమైన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. కీటకాలను దూరం చేసే సహజ సిద్ధమైన పరిష్కారంగా దీన్ని భావిస్తారు. అప్పట్లో రసాయన క్రిమిసంహారకాలు ఉండేవి కాదు. అందుకే ఆ రోజుల్లో నేలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, సానుకూల శక్తిని నింపడానికి ఈ పద్ధతిని ఆచరించేవారు.


