News June 29, 2024
జియో, ఎయిర్టెల్ యూజర్లపై ₹47వేలకోట్ల భారం!

టారిఫ్ పెంపుతో జియో, ఎయిర్టెల్ యూజర్లపై ఏటా ₹47,500కోట్ల భారం పడనుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5జీ సేవలు కావాలనుకునే వారిపై ఈ భారం మరింత ఎక్కువ ఉండనుందని తెలిపారు. జియోలో ₹239 (1.5GB/డే)గా ఉన్న 5జీ మినిమమ్ రీఛార్జ్ అమౌంట్ను 46% పెంచి ₹349 (2GB/డే)కు చేర్చింది. ఎయిర్టెల్ ఏకంగా 71% పెంచింది. ₹239 (1.5GB/డే) ప్యాక్ను ₹409 (2.5GB/డే)కు పెంచింది.
Similar News
News December 1, 2025
జిల్లాలో నేటి నుంచి పోలీసు యాక్ట్ అమలు: సంగారెడ్డి ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నేటి నుంచి 31 రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.
News December 1, 2025
ఆ డాక్టర్లకు 50శాతం ఇన్సెంటివ్!

TG: గిరిజన జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లు, టీచింగ్ ఫ్యాకల్టీకి బేసిక్ పేలో 50% అదనపు ఇన్సెంటివ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రైబల్ ఏరియాకు వెళ్లేందుకు డాక్టర్లు ఇష్టపడట్లేదు. ఫలితంగా కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ఏర్పడి గుర్తింపు కోల్పోయే ప్రమాదముంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి, ఆసిఫాబాద్, MLG, MHBD, భూపాలపల్లి కాలేజీలు గిరిజన ప్రాంతాల పరిధిలోకి వస్తాయి.
News December 1, 2025
శ్రీకాంత్ మాల్డే, చార్మి బిజినెస్ సక్సెస్ సీక్రెట్ ఇదే

శ్రీకాంత్, చార్మి ఎప్పుడూ సాదా సీదా జీవితాన్ని గడపడం, కల్తీలేని ఆర్గానిక్ పద్ధతిని ఎంచుకోవడం, వినియోగదారులతో నిజాయితీగా వ్యవహరించడం చుట్టు పక్కల జనానికి, వారి దగ్గర పాల ఉత్పత్తులను కొనేవారికి బాగా నచ్చింది. ముఖ్యంగా మౌత్ పబ్లిసిటీతోనే వారి వ్యాపారం బాగా జరిగింది. ఫలితంగా రోజురోజుకీ వారి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి 2024 నాటికే రూ.2 కోట్ల టర్నోవర్ సాధించి, ఇప్పుడు మరింత ఆదాయం దిశగా దూసుకెళ్తున్నారు.


