News July 15, 2024
2030 నాటికి ₹580L cr రిటైల్ డిజిటల్ చెల్లింపులు

దేశంలో 2022లో ఇ- కామర్స్ మార్కెట్ ₹6.5L cr ఉండగా, 2030 నాటికి 21% వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. రిటైల్ డిజిటల్ చెల్లింపులు 2023-24లో దాదాపు ₹300L cr ఉండగా, 2030కి ₹580L crకు చేరొచ్చని తెలిపింది. 1965-1996 మధ్య జన్మించిన వారు 72% డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారని పేర్కొంది. అమెజాన్ పే, కార్ని సంయుక్తంగా 120 నగరాల్లో ‘హౌ అర్బన్ ఇండియా పేస్’ పేరుతో ఈ అధ్యయనం చేసింది.
Similar News
News November 6, 2025
నేడు బిహార్‌లో తొలి దశ ఎన్నికలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో(NOV 6, 11) పోలింగ్ జరగనుంది. ఇవాళ తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో 3.75 కోట్ల మంది ఓటర్లు 16 మంది మంత్రులు సహా మొత్తం 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. రెండు విడతల పోలింగ్ అయ్యాక NOV 14న ఓట్లు లెక్కించనున్నారు.
News November 6, 2025
ఇవాళ అమరావతికి సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు లండన్ పర్యటన ముగిసింది. నిన్న రాత్రి 7.30 గంటలకు లండన్ నుంచి స్వదేశానికి తిరిగి పయనమయ్యారు. ఉదయం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతికి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో భేటీ కానున్నారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
News November 6, 2025
అయితే ఆరిక, కాకుంటే కంది, దున్ని చల్లితే శనగ

వాతావరణం, నేల పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆరిక(చిరు ధాన్యాల) పంట బాగా పండుతుంది. ఒకవేళ పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా కంది పంట ఎలాగోలా పండుతుంది. భూమిని బాగా దున్ని, శ్రద్ధగా విత్తనాలు చల్లితే, శనగ పంట తప్పకుండా మంచి దిగుబడినిస్తుంది. ఈ సామెత ముఖ్యంగా వివిధ పంటలకు అవసరమైన శ్రమ, దిగుబడి, హామీ గురించి వివరిస్తుంది. శనగ పంటకు మంచి భూమి తయారీ, శ్రద్ధ అవసరమని చెబుతుంది.


