News October 9, 2024
వరద సాయం కోసం ₹601కోట్ల ఖర్చు: మంత్రి

AP: రాష్ట్రంలో వరద బాధితులకు సాయం చేయడానికి మొత్తం ₹601కోట్లు ఖర్చయిందని మంత్రి నారాయణ వెల్లడించారు. ‘ఆహారానికి ₹92.5కోట్లు, తాగునీటికి ₹11.2Cr, మెడికల్ కేర్కు ₹4.55Cr, పారిశుద్ధ్యానికి ₹22.56Cr ఖర్చయింది. ఎన్టీఆర్ జిల్లాలో ₹139.44Cr.. ఇలా మొత్తం ₹601కోట్లు ఖర్చు పెట్టాం. వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతే ఆదుకోకుండా ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
Similar News
News November 21, 2025
HYDలో రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, రేపు HYDలో పర్యటించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్, తిరుమలగిరి, కార్ఖానా, బేగంపేట మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వీవీఐపీ ప్రయాణాల కారణంగా ఈ రెండు రోజుల్లో CTO, రసూల్పుర, బేగంపేట ఫ్లైఓవర్, పంజాగుట్ట, తిరుమలగిరి, AOC, అల్వాల్, లోతుకుంట తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిపివేసే అవకాశం ఉందన్నారు.
News November 21, 2025
AP వార్తలు

* రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి ‘రైతన్నా.. మీ కోసం’. వ్యవసాయంలో పంచ సూత్రాలపై 7 రోజుల కార్యక్రమాలు
* అక్రమాస్తుల కేసు: 2013 నుంచి బెయిల్పై ఉన్న జగన్ మీద ఇప్పటి వరకు 11 ఛార్జ్షీట్లు ఉన్నాయన్న CBI. విచారణకు 28కి వాయిదా వేసిన నాంపల్లి CBI కోర్టు
* జగన్ బయట ఉంటే ప్రమాదం. బెయిల్ రద్దు చేయాల్సిందే: బుద్దా వెంకన్న
* కల్తీ మద్యం కేసులో వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది: వెల్లంపల్లి శ్రీనివాస్