News October 8, 2024
ఢిల్లీలో ₹65కే కిలో టమాటా
టమాటా రేటు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని సామాన్యులకు కేంద్రం ఉపశమనం కలిగించింది. అక్కడ కిలో టమాటా ₹100-₹120 పలుకుతోంది. దీంతో హోల్‌సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఢిల్లీ సహా శివారులోని 56 ప్రాంతాల్లో ₹65కే ప్రజలకు అందిస్తోంది. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా టమాటా పండించే ప్రధాన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో దిగుబడి బాగా తగ్గింది. దీంతో ధరలు పెరిగాయి.
Similar News
News January 2, 2025
31st Night: హెల్తీ ఫుడ్‌కు ఓటేయలేదు!
భారతీయులు హెల్తీ ఫుడ్‌కు ప్రాధాన్యమివ్వలేదని అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అదనపు క్యాలరీలు వస్తాయంటున్నా మందులోకి మంచింగ్‌గా ఆలూ భుజియానే తీసుకుంటున్నారని చెప్తున్నారు. 31st నైట్ బ్లింకిట్‌లో 2,34,512 pcs ఆర్డరివ్వడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. 100gr ప్యాకెట్‌తో 600 క్యాలరీలు వస్తాయని, వీటిని తగ్గించుకోవాలంటే 45ని. రన్నింగ్ లేదా 90ని. వేగంగా నడవాల్సి ఉంటుందంటున్నారు.
News January 2, 2025
డాక్టర్లు చనిపోయాడన్నారు.. స్పీడ్ బ్రేకర్ బతికించింది..!
మహారాష్ట్రలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి చనిపోయాడని వైద్యులు ప్రకటించడంతో ఇంటికి తీసుకెళ్తుండగా బతికాడు. కొల్హాపూర్‌కు చెందిన పాండురంగ్ ఉల్పే(65)కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. మృతదేహాన్ని అంబులెన్సులో ఇంటికి తీసుకెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద చేతి వేళ్లు కదిపాడు. మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో కోలుకున్నాడు.
News January 2, 2025
రియల్ హీరో.. అంధుడైనా 13 మందిని కాపాడాడు!
చూపు లేకపోయినా ఆపదలో ఉన్న వారిని ప్రాణాలకు తెగించి రక్షించే భుల్లు సాహ్నిని నెటిజన్లు అభినందిస్తున్నారు. బిహార్‌లోని దుమ్దుమాకు చెందిన భుల్లు సాహ్ని ఎందరికో నిజమైన స్ఫూర్తి అని కొనియాడుతున్నారు. ఆయన గంగ, భాగమతి, కమల, బూధి గండక్ వంటి నదుల్లో మునిగిపోయి సాయం కోసం ఎదురుచూసిన 13 మందిని ప్రాణాలతో బయటకు తీశారు. తన తండ్రి నుంచి ఈత, చేపలు పట్టడాన్ని ఆయన నేర్చుకున్నారు. ఈ రియల్ హీరోకు సెల్యూట్.