News August 14, 2024
₹75 వేల కోట్లతో రిఫైనరీ.. శ్రీకాకుళం జిల్లాలో ల్యాండ్ ఆఫర్!
ఏపీలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ ఏర్పాటుకు ఆసక్తిగా ఉంది. రూ.75 వేల కోట్లతో ఏర్పాటు చేయనుండగా ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఆ రిఫైనరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట (శ్రీకాకుళం)లో స్థలాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి రిఫైనరీ ఏర్పాటు చేసే అవకాశముంది. దీని ద్వారా 10 వేల ఉద్యోగాలు రానున్నాయి.
Similar News
News September 13, 2024
శ్రీకాకుళంలో టుడే టాప్ స్టోరీస్
✵ నందిగాంలో నకిలీ నోట్ల కలకలం ✵ శ్రీకాకుళంలో నాలుగు ఇసుక ర్యాంపులు ✵ అలసత్వం వహిస్తే చర్యలు: అచ్చెన్న ✵ శ్రీకాకుళం-తిరుపతికి ప్రత్యేక రైళ్లు ✵ న్యూకాలనీలో తవిటమ్మ మృతి నేత్రాలు మరొకరికి దానం ✵ ఈనెల 14న జిల్లాకు జాతీయ ST కమిషన్ సభ్యుడు ✵ ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు ✵ జిల్లా విజిలెన్స్ ఎస్పీగా బి. ప్రసాదరావు ✵ వంశధార కాలువలో పడి వ్యక్తి మృతి ✵ సోంపేటలో పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
News September 12, 2024
SKLM: పాము కాటుతో మహిళ మృతి
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. బూర్జ గ్రామానికి చెందిన ఖండ్యాపు లక్ష్మీ(53) గురువారం పొలానికి వెళ్లారు. అక్కడ పాము కాటు వేయడంతో పొలంలోనే మృతిచెందారు. మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
News September 12, 2024
శ్రీకాకుళం: విజిలెన్స్ ఎస్పీగా ప్రసాదరావు బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ ఎస్పీగా బర్ల ప్రసాదరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీ సురేష్ బాబు నుంచి పదవీ బాధ్యతలు తప్పకున్నారు. అనంతరం జిల్లా స్థాయి విజిలెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్పీకి పలువురు అభినందనలు తెలియజేశారు.