News March 31, 2025
❤️ఇది కదా సక్సెస్ అంటే..!

నిన్న CSKపై RR ఘన విజయం సాధించింది. కెప్టెన్ రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఆ జట్టుకు ఇది తొలి గెలుపు. తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న CSKను పరాగ్ ఓడించడం విశేషం. ఈ క్రమంలో ధోనీతో కలిసి దిగిన చిన్నప్పటి పరాగ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఆరాధ్య క్రికెటర్‌తో పోటీపడి ఆ జట్టును ఓడించడం కంటే సక్సెస్ ఏముంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News April 4, 2025
BREAKING: SRH ఘోర ఓటమి

SRH హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై KKR 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆరెంజ్ ఆర్మీ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. క్లాసెన్ 33, కమిందు 27, నితీశ్ 19, కమిన్స్ 14 మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. వైభవ్, వరుణ్ చెరో 3 వికెట్లు, రస్సెల్ 2, హర్షిత్, నరైన్ చెరో వికెట్ తీశారు.
News April 4, 2025
అనకాపల్లి జిల్లాకు భారీ బల్క్ డ్రగ్ కంపెనీ

AP: అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లిలో బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు లారెస్ సంస్థ ముందుకొచ్చింది. రూ.5000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కొత్త ప్లాంట్ ద్వారా ఫర్మంటేషన్, క్రాప్ సైన్స్ కెమికల్స్, గ్రీన్ కెమిస్ట్రీ వంటి స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తి చేయనుంది. సీఎం చంద్రబాబును కలిసి పెట్టుబడులపై సంస్థ సీఈవో సత్యనారాయణ చర్చించారు.
News April 4, 2025
రూ.4,00,000 సాయం.. కీలక ప్రకటన

TG: రాజీవ్ యువ వికాసం <<15922104>>దరఖాస్తులపై <<>>BC కార్పొరేషన్ స్పష్టత ఇచ్చింది. దరఖాస్తుదారుల వద్ద రేషన్‌కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని, రేషన్‌కార్డు లేకుంటే ఇన్కమ్ సర్టిఫికెట్తో <