News May 27, 2024
❤️మనసులు గెలుచుకున్న SRH!

టోర్నీ ఆద్యంతం ఆకట్టుకున్న SRH చివరి మెట్టుపై బోల్తా పడింది. IPL చరిత్రలో అత్యధిక స్కోర్(287), పవర్ ప్లేలో హైయెస్ట్ స్కోర్(125), అత్యంత వేగంగా 150+ స్కోర్ ఛేదన.. ఇలా ఎన్నో రికార్డులను SRH తిరగరాసింది. అభిషేక్, హెడ్, క్లాసెన్ వీర బాదుడు కోసం మిగతా జట్ల ఫ్యాన్స్ సైతం SRH మ్యాచ్ కోసం ఎదురుచూసేవారు. విధ్వంసకర ఆటతీరుతో కమిన్స్ సేన మిగతా జట్లను భయపెట్టింది. FINALలో ఓడినా అభిమానుల మనసులు గెలుచుకుంది.
Similar News
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<
News November 27, 2025
డిసెంబర్‌లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్‌లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.


