News December 18, 2025

అంకితభావం చాటిన అధికార యంత్రాంగం!

image

కామారెడ్డి జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఎన్నికల విభాగాల సిబ్బంది కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

Similar News

News December 20, 2025

జూలపల్లి: తమ్ముడు ఉప సర్పంచ్.. అక్క వార్డ్ మెంబర్‌

image

జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విశేష ఫలితం వెలువడింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఆవుల శ్రీనివాస్ యాదవ్ వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆయన సోదరి తమ్మడవేణి రాధ మరో వార్డు మెంబర్‌గా విజయం సాధించారు. తమ్ముడు ఉప సర్పంచ్‌గా, అక్క వార్డు మెంబర్‌గా ఎన్నిక కావడంపై గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.

News December 20, 2025

అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. BSFలో 50 శాతం కోటా

image

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అగ్నివీరులకు గుడ్‌న్యూస్ చెప్పింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీరుల కోటాను 10% నుంచి 50%కి పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ మార్పులు ప్రస్తుతానికి BSFకే వర్తిస్తాయని, ఇతర కేంద్ర బలగాలకు కాదని స్పష్టం చేసింది. కాగా అగ్నివీరులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నుంచి మినహాయింపు ఉండగా, రాత పరీక్ష తప్పనిసరి అని పేర్కొంది.

News December 20, 2025

నల్గొండ: ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి?

image

జీపీ ఎన్నికల అనంతరం గ్రామాల్లో నూతన చర్చ జరుగుతోంది. సహకార, మార్కెటింగ్ సంస్థలకు పాలకవర్గాలను రద్దు చేయడంతో ఏ ఎన్నికలు ముందు జరుగుతాయనే చర్చ మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, సహకార సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మున్సిపాలిటీలకు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాల్సి ఉంది. దీంతో ముందు మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు.