News February 28, 2025
అంకెల గారడీ.. అమలు శూన్యం: తిరుపతి MP

రాష్ట్ర బడ్జెట్‌పై తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ బడ్జెట్ వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని MP మండిపడ్డారు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనిపించేలా బడ్జెట్ ఉందని విమర్శించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధుల కేటాయింపులో కోత పడుతుందనే వాస్తవాలను ఈ బడ్జెట్ చెప్పకనే చెబుతుందని MP అన్నారు.
Similar News
News September 14, 2025
VKB: టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో కొనసాగుతున్న మోమిన్‌పేటలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ బోధించడానికి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. ఎంఎస్సీ, బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 16న నిర్వహించే ఇంటర్వ్యూ, డెమో క్లాస్‌కు హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 6301013028, 7981718918ను సంప్రదించాలని సూచించారు.
News September 14, 2025
కొందరు MLAలు అసెంబ్లీకి రాకున్నా జీతం తీసుకుంటున్నారు: అయ్యన్న

AP: కొందరు MLAలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ‘ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికే. ఉద్యోగాలకు రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్పీకర్ ఆలోచించి, మార్గదర్శకాలివ్వాలి. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేది 45రోజులు.. వాటికీ రాకపోతే ఎలా’ అని ప్రశ్నించారు.
News September 14, 2025
MBNR:జాతీయ మెగా లోక్ అదాలత్..UPDATE

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ డి.జానకి వెల్లడించారు.
✒సైబర్ కేసులు:97(₹32,19,769/- రీఫండ్)
✒కాంప్రమైజ్ కేసులు:193
✒ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కేసులు(డ్రంక్ అండ్ డ్రైవ్, MV Act):564
✒ఐపీసీ(అండర్ ఇన్వెస్టిగేషన్/కోర్టు విచారణలో ఉన్నవి): కేసులు-253
✒మొత్తం పరిష్కరించబడిన కేసులు: 2,597