News August 31, 2025
అంగన్వాడీలకు PD కీలక సూచన

అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు EKYC, THRలో నూరు శాతం పూర్తి చేయాలని, దానికి అనుగుణంగానే వచ్చే నెల పౌష్టికాహార ఇండెంట్ వస్తుందని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కె.వి కృష్ణవేణి తెలిపారు. ప్రస్తుతం EKYCలు 96 శాతం ఉందని దాన్ని నూరు శాతం చేయాలని, THRలు 66 శాతం మాత్రమే ఉన్నాయని దాన్ని 30 శాతానికి పెంచితేనే వచ్చే నెలకు సంబంధించిన ఇండెంట్ వస్తుందని తెలిపారు.
Similar News
News September 3, 2025
జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో కేంద్రం ద్వారా అమలు చేసే ఈ పథకం కింద ఒకేసారి రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్ పొందుతున్నప్పటికీ, ఈ పథకానికి అర్హులేనని అన్నారు. దరఖాస్తులన్నింటినీ విచారణ చేసి త్వరితగతిన ఆర్డీఓకు పంపించాలని అధికారులను ఆదేశించారు.
News September 2, 2025
గణేష్ నిమజ్జనానికి పటిష్ఠమైన ఏర్పాట్లు: ఎస్పీ

వినాయక నిమజ్జనానికి పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. నల్గొండలోని వల్లభరావు చెరువు వద్ద గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లైటింగ్, బారికేడ్లు, క్రేన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
News September 2, 2025
NLG: విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని HRC ఆదేశం

నల్గొండలోని నలంద ఫార్మసీ కళాశాల యాజమాన్యం తమకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ షమీమ్ అక్తర్, బీ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులకు వారి టీసీ, ఇతర సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు.