News December 10, 2025
అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు: మంత్రి సంధ్యారాణి

రాష్ట్ర వ్యాప్తంగా 58,746 అంగన్వాడీ కార్యకర్తలుకు 5జీ మొబైల్ ఫోన్లు ఉచితంగా అందిస్తున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. బుధవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లు అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టబడి ఉందని ఆమె తెలిపారు.
Similar News
News December 12, 2025
RRలో 88.67% ఓటింగ్.. BRS, కాంగ్రెస్ సర్పంచ్‌లు వీరే!

రంగారెడ్డిలో 1stవిడత సర్పంచ్ ఎలక్షన్స్‌లో 88.67% పోలింగ్ నమోదైంది. ఆద్యంతం BRS, కాంగ్రెస్ మధ్యే పోటీ నడిచింది.
☛ శంషాబాద్: 21 GPలకు Cong 12, BRS 3, BJP 2
☛ ఫరూక్‌నగర్: 47GPలకు Cong 28, BRS 18
☛ చౌదరిగూడ: 24GPలకు, Cong 13, BRS 11
☛ కేశంపేట్: 29లకు, Cong 15, BRS 13
☛ కొందుర్గు: 22GPలకు, Cong 13, BRS8, BJP 1
☛ నందిగామ: 19GPలకు Cong 6, BRS 12
☛ కొత్తూరు: 12GPలకు, Cong 9, BRS 3 సర్పంచ్‌లు గెలిచాయి.
News December 12, 2025
ఈనెల 15 నుంచి జీజీ కళాశాల డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల రీఅడ్మిషన్

జీజీ కళాశాల డిగ్రీ 2, 4, 6, సెమిస్టర్ల రీ అడ్మిషన్లకు జనవరి 12వ తేదీ వరకు అవకాశం ఉందని ప్రిన్సిపల్ డా.రామ్మోహన్ రెడ్డి, కంట్రోలర్ భరత్ రాజ్, వైస్ ప్రిన్సిపల్ డా.రంగరత్నం తెలిపారు. డిగ్రీ రెండో సెమిస్టర్ తరగతులు డిసెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతాయననారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని సూచించారు.
News December 12, 2025
మహబూబాబాద్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

జిల్లాలో 155 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 86.99 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.


