News October 8, 2025

అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన భద్రాద్రి కలెక్టర్

image

కొత్తగూడెంలో ప్రకాష్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారుల హాజరు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పర్యవేక్షణ, విద్యా కార్యక్రమాల అమలు విధానాలను సమీక్షించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి, పిల్లలకు సమయానికి ఆహారం, పాలు, గుడ్లు అందజేయాలని ఆదేశించారు.

Similar News

News October 8, 2025

రేపు చలో బస్‌భవన్‌కి కేటీఆర్ పిలుపు

image

పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు చలో బస్ భవన్ పిలుపు నిచ్చింది. ఉ.9 గంటలకు రైతిఫైల్ బస్టాప్ నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజిమంత్రులు, బీఅరెస్ నేతలు ప్రయాణించనున్నారు.

News October 8, 2025

పాకిస్థాన్ ఘోర ఓటమి

image

WWCలో భాగంగా AUSతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 107 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. తొలుత AUS 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. సిద్రా అమీన్(35) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. ఆసీస్ బౌలర్లలో గార్త్ 3 వికెట్లతో రాణించారు. WWCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ పాక్ ఓడింది. దీంతో పాయింట్ల టేబుల్‌లో చివర నిలిచింది.

News October 8, 2025

పెనమలూరు: భర్త మందులు తీసుకురాలేదని ఆత్మహత్య

image

కానూరులో నివాసం ఉంటున్న మధులత 5ఏళ్ల నుంచి సోరియాసిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. భర్త నాగేశ్వరరావుకు మందులు తీసుకురమ్మని వాట్సాప్‌లో చీటీ పెట్టగా.. అందులో అండర్ లైన్ చేసిన మందు మాత్రమే భర్త తీసుకువచ్చాడు. అన్ని మందులు తేకుండా ఒక ముందు మాత్రమే తెచ్చాడని భర్తను ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్థాపానికి గురైన మధులత ఇవాళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.