News March 5, 2025
అంగన్వాడీ కేంద్రాలకు నిధుల మంజూరు

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రూ.3.08 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను అంగన్వాడీలలో సీమంతం, అన్నప్రాశన, తదితర కార్యక్రమాలకు వినియోగిస్తారు. అనంత జిల్లాలో 2,303 కేంద్రాలకు రూ.1.38 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2,824 కేంద్రాలకు 1.70 కోట్లు నిధులు కేటాయించారు. దీంతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 5, 2025
ఈ నెల చివరి వరకు రైళ్లు తిరగవు..!

గుంతకల్లు మీదుగా ప్రయాణం సాగించే పలు ప్యాసింజర్ రైళ్లు కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తిరిగి ఆ రైళ్లు గుంతకల్లుకు చేరుకునేందుకు ఈ నెల చివరి వరకూ పడుతుందని అధికారులు పేర్కొన్నారు. తిరుపతి-కదిరిదేవరపల్లి (57405) ప్యాసింజర్ రద్దును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించామన్నారు. కదిరిదేవరపల్లి-తిరుపతి(57406) ఈనెల 31, గుంతకల్లు-తిరుపతి(57404) 30, తిరుపతి-గుంతకల్లు(57403) 31వ తేదీ వరకు తిరగవన్నారు.
News March 5, 2025
మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి: జిల్లా కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణ కోసం ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 8న నగరంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు.
News March 4, 2025
నవోదయం 2.0పై విస్తృతంగా అవగాహన

నవోదయం 2.0పై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 కార్యక్రమానికి సంబంధించిన కళాజాత ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. నాటు సారాను నిర్మూలించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, నవోదయం 2.0పై నెల రోజులపాటు కళాజాత ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు.