News December 21, 2025
అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో అంగన్వాడీ సిబ్బంది నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు 22 నుంచి 30వ తేదీ వరకు సమర్పించవచ్చన్నారు. ఎన్పీ కుంట మండలం p.కొత్తపల్లి BC-B, తిమ్మమ్మ మర్రిమాను BC-B, ఎదురుదోన OC, తలుపుల కొవ్వూరు వాండ్లపల్లి OC, కదిరి జామియా మసీదు SC, కొలిమి ఏరియా BC-Bలకు కేటాయించినట్లు తెలిపారు.
Similar News
News December 30, 2025
సిద్దిపేట: షీ టీం ఆధ్వర్యంలో 337 మందికి కౌన్సిలింగ్

2025లో ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన 337 మందికి కౌన్సెలింగ్ చేసినట్లు సిద్దిపేట జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదికలో తెలిపింది. షీ టీమ్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో మహిళలు, విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈవ్ టీజింగ్ చట్టాలపై ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. మిగతా జిల్లాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టితే మహిళల భద్రత మరింత మెరుగుపడుతుంది.
News December 30, 2025
కొత్తగా నాటిన అరటి తోటల్లో కలుపు నివారణ ఎలా?

కొత్తగా నాటిన అరటి తోటల్లో కలుపు నివారణ చాలా ముఖ్యం. దీని కోసం హెక్టారుకు 500 లీటర్ల నీటిలో బుటాక్లోర్ 5L లేదా అలాక్లోర్ 2.5L లేదా పెండిమెథాలిన్ 2.5లీటర్లలో ఏదో ఒక మందును కలిపి నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. దీని వల్ల కలుపు మొలవకుండా అరికట్టవచ్చు. 100 మైక్రానుల మందం కలిగిన పాలిథీన్ మల్చింగ్ షీటును నేలపై పరచి ఆ తర్వాత మొక్కనాటితే కలుపు సమస్యను అధిగమించవచ్చు.
News December 30, 2025
రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్!

రష్మిక, విజయ్ దేవరకొండ కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ సెలబ్రిటీలు పెళ్లి చేసుకోనున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని సమాచారం. కాగా దీనిపై హీరోహీరోయిన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.


