News March 30, 2025

అంగళ్లు : గ్యాస్ సిలిండర్ పేలి గాయపడ్డ వ్యక్తి మృతి

image

అంగళ్లులో గ్యాస్ సిలిండర్ పేలి గాయపడ్డ టీ కొట్టు నిర్వాహకుడు కృష్ణయ్య మృతి చెందాడని పోలీసులు ఆదివారం తెలిపారు. కురబలకోట మండలం, అంగళ్లులో ఈనెల 22 న టీ కొట్టు నడుపుతుండగా గ్యాస్ సిలిండర్ పేలి కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డారు. బాధితున్ని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి తిరుపతి రుయాకు తరలించారు. రుయాలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News April 1, 2025

యువతిని చంపి జీడితోటలో చెట్టుకు వేలాడదీశాడు

image

సాలూరు మండలం చీపురువలసలో జరిగిన యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మర్రివానివలసకు చెందిన ఐశ్వర్య విశాఖలో పనిచేస్తోంది. ఓ పెళ్లిలో దత్తివలసకు చెందిన వివాహితుడు రాంబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడ్ని గుడ్డిగా ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. ఈ క్రమంలో రాంబాబు యువతిని చంపి చెట్టుకు చున్నీతో వేలాడదీసి ఆత్మహత్యలా చిత్రీకరించాడు.

MARCH: రికార్డు స్థాయిలో UPI పేమెంట్స్

image

దేశంలో డిజిటల్ పేమెంట్స్ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. మార్చిలో రూ.24.77లక్షల కోట్ల UPI పేమెంట్స్ జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) వెల్లడించింది. 18.3 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ నమోదయ్యాయంది. వరుసగా 11 నెలల నుంచి ప్రతినెలా రూ.20లక్షల కోట్లకు పైగా పేమెంట్స్ జరగడం విశేషం. JAN-MAR క్వార్టర్‌లో రూ.70.2లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఇది 24% అధికం.

error: Content is protected !!