News April 5, 2025
అంటరానితనం నిర్మూలనకు జగ్జీవన్ రామ్ కృషి: కలెక్టర్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్సు స్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంటరానితనమన్నదే ఉండకూడదని, అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణు మాధవ్ ఉన్నారు.
Similar News
News April 6, 2025
నెల్లూరు: బస్ స్టాండ్‌లలో రద్దీ

నేడు(ఆదివారం) శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు RTC బస్ స్టాండ్‌లలో రద్దీ ఏర్పడింది. బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దూర ప్రాంతాల్లో వ్యాపారులు, ఉద్యోగులు పండుగకు స్వగ్రామాలకు పయనం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బస్ స్టాండ్‌లలో ఆకతాయిలు, జేబు దొంగల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News April 6, 2025
కన్నులపండువగా కోదండ రాముని ధ్వజారోహణం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం శ్రీరామ నవమి రోజు ధ్వజారోహణం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వేడుక నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలి వచ్చి కార్యక్రమాన్ని తిలకించారు.
News April 6, 2025
WGL: పల్లి గింజపై శ్రీరాముని ప్రతిమ

వరంగల్ నగరంలోని కాశిబుగ్గకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కుసుమ లింగమూర్తి మరోసారి తన ప్రతిభ చాటారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పల్లి గింజపై శ్రీరాముని ప్రతిమను చిత్రీకరించారు. ఈ సందర్భంగా పలువురు అభినందిస్తున్నారు. గతంలో ఆయన శనిగపప్పుపై వివేకానందుడు, పల్లికాయపై వినాయకుడి ప్రతిమలను గీసి ఔరా అనిపించారు.