News September 3, 2025
అంటువ్యాధులు ప్రబలకుండా చూడండి: డీఎంహెచ్ఓ

బషీరాబాద్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డీఎంహెచ్ఓ లలితాదేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు ఆమె సూచించారు.
Similar News
News September 3, 2025
జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు: కలెక్టర్

స్వచ్ఛ భారత్ మిషన్, జల జీవన్ మిషన్ అమలుపై బుధవారం ఢిల్లీ నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ సెక్రటరీ 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భీమవరంలో కలెక్టర్ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిబ్బంది పాల్గొన్నారు.
News September 3, 2025
విద్యార్థులకు రూ.12,000.. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

AP: పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం NMMS పేరుతో నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12వేల చొప్పున అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించే ఈ పరీక్షకు రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అర్హులైన వారికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు సాయం అందనుంది. పూర్తి వివరాలకు <
News September 3, 2025
ఖైరతాబాద్: నిమజ్జనానికి రూట్ మ్యాప్ రెడీ: సీపీ ఆనంద్

గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేశామని HYD సీపీ సీవీ.ఆనంద్ తెలిపారు. రూట్ మ్యాప్‌లో భాగంగా ఆయన HYD కలెక్టర్ హరిచందన, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి బాలాపూర్ గణేశ్ మండపాన్ని ఈరోజు సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జన శోభాయాత్ర సాగే చాంద్రాయణగుట్ట, చార్మినార్, మొజాంజాహీ మార్కెట్, అబిడ్స్, ట్యాంక్ బండ్ రూట్‌లను పరిశీలించి పలు సూచనలు చేశారు.