News December 25, 2025

అంటే.. ఏంటి?: Debris

image

కూల్చిన లేదా కూలిపోయిన వాటి శిథిలాలు, మిగిలిన వ్యర్థాలను సూచించే క్రమంలో ఈ పదం వాడుతారు. ఇది debriser అనే ఫ్రెంచ్ పదం నుంచి పుట్టింది. దానికి అర్థం ముక్కలవడం.
Ex: Debris littered the beach

రోజూ 12Pmకు ఓ కొత్త ఆంగ్ల పదం అర్థం, పుట్టుక తెలుసుకుందాం
<<-se>>#AnteEnti<<>>

Similar News

News December 25, 2025

పాత్రల నీచు వాసన ఇలా దూరం

image

మాంసాహార వంటకాలు వండిన తర్వాత ఆ పాత్రలు ఎంత శుభ్రం చేసినా నీచు వాసన వస్తూనే ఉంటాయి. ఆ వాసన పోవాలంటే ఈ టిప్స్ పాటించండి. ముందుగా మాంసం వండిన పాత్రలను నీటితో శుభ్రం చేసి తర్వాత కాస్త వెనిగర్ చల్లాలి. కాసేపటి తర్వాత వేడినీటితో కడిగితే సరిపోతుంది. నిమ్మచెక్కతో పాత్రలను రుద్దినా వాసనలు పోతాయి. బకెట్ నీళ్లల్లో బేకింగ్ సోడా వేసి దానిలో కడిగిన పాత్రలను ముంచి తీసినా దుర్వాసన పోతుంది.

News December 25, 2025

‘ఛాంపియన్’ మూవీ రివ్యూ&రేటింగ్

image

ఫుట్‌బాల్ ఛాంపియన్‌గా నిలవాలనుకునే హీరో బైరాన్‌పల్లి స్వాతంత్ర్య ఉద్యమంలో ఎలా చిక్కుకున్నాడు? చివరికి ఆ హీరో కల నెరవేరి ఛాంపియన్ అయ్యాడా లేదా అనేదే మూవీ కథ. హీరోహీరోయిన్లు రోషన్, అనస్వర నటన మెప్పిస్తుంది. సాంకేతికంగా బాగుంది. చాన్నాళ్ల తర్వాత తెరపై కనిపించిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి యాసతో మెప్పించలేకపోయారు. కొన్ని సీన్లు అనవసరం అనిపిస్తాయి. ఎమోషన్ సరిగ్గా పండలేదు.
రేటింగ్: 2.5/5

News December 25, 2025

నిమ్మ, నారింజ, బత్తాయి తోటల్లో పూత, పిందె రాలకుండా ఉండాలంటే..

image

నిమ్మ, నారింజ, బత్తాయి తోటల్లో నత్రజని, భాస్వరంతో పాటు పొటాష్‌ కూడా ముఖ్యం. ఇది ఆకుల్లో తయారైన పిండిపదార్థాలు, మాంసకృత్తుల రవాణాకు అవసరమైన ఎంజైములను ఉత్తేజపరిచి పూత, పిందెరాలడాన్ని తగ్గిస్తుంది. 1% పొటాషియం నైట్రేట్‌ను బఠాణి గింజ పరిమాణంలో పిందెలు ఉన్న బత్తాయి చెట్టుపై పిచికారీ చేస్తే పిందె రాలడం తగ్గి, పండు పరిమాణంతో పాటు రసం శాతం, రసంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరల శాతం కూడా పెరుగుతుంది.