News December 22, 2025

అంటే.. ఏంటి? Extravaganza

image

విలాసం, కనువిందుగా కార్యక్రమం జరిగింది అని చెప్పే సందర్భంలో ఈ పదం వాడుతారు. ఇది ఇటాలియన్ భాషలోని Estravaganza పదం నుంచి పుట్టింది.
అంటే.. ఏంటి?లో రోజూ 12pmకు కొత్త పదం అర్థం, పద పుట్టుక వంటి వివరాలు తెలుసుకోండి.
<<-se>>#AnteEnti<<>>

Similar News

News December 22, 2025

నోటి పూత ఎలా తగ్గించాలంటే?

image

విటమిన్ లోపం, వాతావరణ మార్పుల వల్ల నోటి పూత వేధిస్తుంది. ఇది సాధారణంగా 2వారాల్లో తగ్గిపోతుంది. సమస్య ఎక్కువైతే తేనె, కొబ్బరి, పాల పదార్థాలు తినాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఉప్పునీటిని పుక్కిలించడం, తులసి ఆకులు నమలడం, చల్లటి నీటితో నోరు శుభ్రం చేసుకోవడం, లవంగం నమలడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది. వీటితోపాటు విటమిన్ లోపాన్ని నివారించడానికి వైద్యులను సంప్రదించి మాత్రలు వాడాలని సూచిస్తున్నారు.

News December 22, 2025

మీకు తెలుసా?.. ఆ ఊరిలో ఒక్కరే ఉంటారు!

image

ఒక ఊరికి ఒక్కరే రాజు, ఒక్కరే బంటు అంటే వినడానికి వింతగా ఉన్నా.. అమెరికాలోని ‘మోనోవి’లో ఇదే జరుగుతోంది. 89 ఏళ్ల ఎల్సీ ఐలర్ ఆ ఊరిలో ఏకైక నివాసి. ఏటా తనకు తానే ఓటు వేసుకుని మేయర్‌గా గెలుస్తారు. సెక్రటరీగా సంతకాలు చేస్తూ, తన హోటల్ కోసం తానే లైసెన్సులు ఇచ్చుకుంటారు. ఊరి మనుగడ కోసం పన్నులు చెల్లిస్తుంటారు. భర్త జ్ఞాపకార్థం ఒక లైబ్రరీ, ఒక హోటల్ నడుపుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.

News December 22, 2025

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో టెక్నీషియన్ పోస్టులు

image

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<>HAL)<<>>నాసిక్‌లో 18 ఎక్స్ సర్వీస్‌మెన్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, ఇంటర్ అర్హత కలిగి ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్‌లో పని చేసిన వారు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in